‘‘తొలి రెండు రోజులు 8, 9 తేదీల్లో కొంతమంది తితిదే సిబ్బందికి ఆలయ ప్రవేశం ఉంటుంది. 10న తిరుమల స్థానికులకు అవకాశం కల్పిస్తారు. ఈ ప్రయోగాత్మక ప్రక్రియను పరిశీలించి 11 నుంచి సాధారణ భక్తులను అనుమతిస్తామ’’ని తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, తిరుపతి జేఈవో బసంత్‌కుమార్‌తో కలిసి దర్శనం విధివిధానాలను వివరించారు.
11 నుంచి కలియుగ వైకుంఠమూర్తి దర్శన భాగ్యానికి దారిదీ...!
- ఉదయం 6.30 నుంచి
ఉదయం 6.30 నుంచి రాత్రి 7.30 దాకే దర్శనం! శ్రీవారి మూలమూర్తి దర్శనం మినహా.. వకుళమాత, యోగ నరసింహస్వామి ఉప ఆలయాలకూ అనుమతించరు. ఆర్జిత సేవలకూ భక్తులకు అనుమతి లేదు. శఠారి, తీర్థం, ప్రసాద వితరణా ఉండదు.
- వీఐపీ పాస్‌లు చెల్లవు
దర్శనానికి ఎవ్వరి సిఫార్సు లేఖలూ చెల్లవు. ప్రొటోకాల్ ఉన్న వీఐపీలు వ్యక్తిగతంగా వస్తే వారికి మాత్రమే ఉదయం 6.30 నుంచి 7.30 వరకు బ్రేక్ దర్శనం కల్పిస్తారు.
- గదికి ఇద్దరే...
ఆన్లైన్లో దర్శనం టికెట్లతో పాటే అద్దె గదినీ బుక్ చేసుకోవచ్చు. ఒక వసతి గృహంలో ఇద్దరికే అనుమతి. 24 గంటలకే పరిమితి. పొడిగింపునకు వీల్లేదు.
- తలనీలాలు ఇవ్వొచ్చు...
కల్యాణకట్ట ఉదయం 6.30 నుంచి రాత్రి 7 గంటల వరకు తెరుస్తారు. క్షురకులు పీపీఈ కిట్లు ధరిస్తారు.
- రోజుకు 6వేల టికెట్లు
* రోజుకు 6-7 వేల మందికి దర్శనం ఏర్పాట్లు. 3వేల టికెట్లు (ఒక్కొక్కటి రూ.300) తితిదే వెబ్సైట్లో అమ్ముతారు. జూన్ నెల ఆన్లైన్ టికెట్ల కోటాను నేడో రేపో విడుదల చేస్తారు.
* మరో 3వేల టికెట్లను కింది తిరుపతిలో కౌంటర్ల ద్వారా (ఈనెల 10 నుంచి) ఇస్తారు. దర్శనానికి ఒకరోజు ముందు వీటిని తీసుకోవాలి. ఇవి ఉచిత టికెట్లు.
- గంటకు 500