Tirumala srivani trust Darshanam: నేడు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తితిదే తెలిపింది. జనవరి, ఫిబ్రవరి కోటాను మధ్యాహ్నం 3 గం.కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. జనవరి 1న వెయ్యి బ్రేక్ దర్శన టికెట్లు(రూ.500), వైకుంఠ ఏకాదశి, జనవరి 13న జనవరి 13న రోజు వెయ్యి మహాలఘు దర్శన టికెట్ల(రూ.300)ను అందుబాటులో ఉంచనున్నారు. అలాగే జనవరి 14 నుంచి 22 వరకు రోజుకు 2 వేల చొప్పున లఘు దర్శన(రూ.500) టికెట్లు విడుదల చేస్తారు.
జనవరి, ఫిబ్రవరి నెలల్లో మిగతా రోజుల్లో ఆన్‌లైన్‌లో బ్రేక్ దర్శన టికెట్లను సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 200 చొప్పున, శని, ఆది వారాల్లో 300 చొప్పున బ్రేక్ దర్శన టికెట్ల(రూ.500)ను విడుదల చేయనున్నారు.