శ్రీవారి భక్తులకు ఎట్టకేలకు శుభవార్త అందింది. ఫిబ్రవరి 15 నుంచి ఆఫ్లైన్లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు తితిదే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కొవిడ్ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఆఫ్‌లైన్ టికెట్ల జారీ ప్రక్రియను తితిదే నిలిపివేసిన విషయం తెలిసిందే.
TTD : శ్రీవారి భక్తులకు శుభవార్త.. రేపటి నుంచి ఆఫ్లైన్లో సర్వదర్శనం టోకెన్లు - ttd Sarva Darshan offline tokens
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. రేపటి నుంచి ఆఫ్లైన్లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు తితిదే ప్రకటించింది. ఉదయం 9 గంటలకు టోకెన్లు జారీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
TTD News
ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఆఫ్‌లైన్ టికెట్ల జారీ ప్రక్రియను పునరుద్ధరించాలని తితిదే నిర్ణయించింది. 16వ తేదీ సర్వదర్శనం కోసం 15వ తేదీ ఉదయం 9 గంటలకు టోకెన్లు జారీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసే కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేయనున్నారు.