భక్తులు తిరుమలలోని అతిథిగృహంలో మరిచి వెళ్లిన రూ.2 లక్షల విలువైన 40 గ్రాముల బంగారు ఆభరణాలను... తితిదే శ్రీ పద్మావతి విచారణ కేంద్రం అధికారులు తిరిగి బాధితులకు అందజేశారు. విచారణ కేంద్రం సూపరింటెండెంట్ మునిబాల తెలిపిన వివరాల మేరకు.. ఏపీలోని చిత్తూరుకు చెందిన భక్తవత్సలం నాయుడు కుమార్తె ఈనెల 14వ తేదీన సోమసదన్ అతిథి గృహంలో గది తీసుకున్నారు. 15వ తేదీ శ్రీవారి దర్శనం అనంతరం ఖాళీ చేసి వెళ్లారు.
తిరుమల సిబ్బంది నిజాయితీ.. బంగారు అప్పగింత!
తిరుమలలో భక్తులు మరిచిపోయిన బంగారు ఆభరణాలను తితిదే అధికారులు తిరిగి అప్పగించారు. మంచితనాన్ని చాటుకున్న సిబ్బందిని భక్తులు అభినందించారు.
నిజాయితీ చాటుకున్న తిరుమల అధికారులు
అతిథిగృహం అటెండర్ శ్రీనివాసులు.. గదిలో 40 గ్రాముల బంగారు ఆభరణాలను గుర్తించి విచారణ కేంద్రం అధికారులకు అప్పగించారు. వారు భక్తులను గుర్తించి సమాచారం అందించారు. వారు వివరాలు, గుర్తులు చెప్పి నిర్ధారించారు. సూపరింటెండెంట్ మునిబాల, ఏవీఎస్‌వో పవన్.. ఆభరణాలను భక్తుడు భక్తవత్సవలం నాయుడికి అందించారు. కార్యక్రమంలో విచారణ కేంద్రం మేనేజర్ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:శ్రీవారి సన్నిధిలో గవర్నర్ తమిళిసై!