ఏపీవ్యాప్తంగా 2.4 లక్షల లడ్డూలను తితిదే విక్రయించింది. 3 గంటల్లోనే 2.4 లక్షల లడ్డూలు అమ్ముడుపోయాయి. గుంటూరు మినహా 12 జిల్లాల్లో లడ్డూ ప్రసాదాల విక్రయాలను మొదలుపెట్టింది.
ఏపీవ్యాప్తంగా 2.4 లక్షల తిరుమల లడ్డూలు విక్రయం - latest news of TTD
ఆంధ్రప్రదేశ్లో 2.4 లక్షల లడ్డూలను తితిదే విక్రయించింది. ఒక్క గుంటూరు జిల్లా మినహా 12 జిల్లాల్లో విక్రయాలను చేపట్టారు. భక్తుల విజ్ఞప్తి మేరకు తెలంగాణ, తమిళనాడుకు ప్రతి రోజు లడ్డూలను తరలించే యోచనలో తితిదే ఉంది.
ఏపీవ్యాప్తంగా 2.4 లక్షల తిరుమల లడ్డూలు విక్రయం
గుంటూరులో ఈనెల 30 నుంచి లడ్డూ ప్రసాదాల విక్రయాలను ప్రారంభించనున్నారు. మంగళవారం మరో 2 లక్షల లడ్డూ ప్రసాదాలు జిల్లా కేంద్రాలకు తరలించనున్నారు. లడ్డూలు విక్రయించాలని తమిళనాడు, తెలంగాణ భక్తుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ మేరకు ప్రతిరోజు తమిళనాడుకు లక్ష, తెలంగాణకు 50 వేల లడ్డూలు తరలించే యోచనలో తితిదే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:తితిదే ఆస్తుల విక్రయం అసంబద్ధ నిర్ణయం: ఐవైఆర్ కృష్ణారావు