తిరుమలలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ ప్రాంతంలో చలి తీవ్రత అధికంగా ఉంది. మంచు తెరలు కమ్ముకుని ఆ కొండలు ఆహ్లాదభరితంగా దర్శనమిస్తున్నాయి. కాగా రహదారులను మంచు దుప్పట్లు కమ్మేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
మంచు తెరలతో శోభాయమానంగా తిరుమల గిరులు - తిరుమలలో చలితీవ్రత
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుమల గిరుల్లో చలితీవ్రత పెరిగింది. కొండపై మంచు తెరలు కమ్ముకుని ఆహ్లాదభరితమైన వాతావరణం దర్శనమిస్తోంది. ఎటు చూసినా కనువిందు చేస్తున్న దట్టమైన పొగమంచుతో.. తిరుమల సరికొత్త అందాలను సంతరించుకుంది. రహదారులను మంచు దుప్పట్లు కప్పేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
మంచు తెరలతో శోభాయమానంగా తిరుమల గిరులు