తెలంగాణ

telangana

ETV Bharat / state

Brahmotsavam: బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - ap news

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సప్తగిరులు ముస్తాబయ్యాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అర్చకులు వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ(Brahmotsavam ceremony starts) కార్యక్రమాన్ని నిర్వహించారు.

ttd
ttd

By

Published : Oct 6, 2021, 10:45 PM IST

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అర్చకులు అంకురార్పణ(Srivari Brahmotsavam ceremony) కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీవారి సేనాధిపతి అయిన విష్వక్సేనుల వారిని శ్రీవారి సన్నిధి నుంచి రంగనాయకుల మండపానికి వేంచేపు చేశారు. అక్కడ అర్చకుల వైధిక కార్యక్రమాలను వేడుకగా నిర్వహించారు. కల్యాణమండపంలోని యాగశాలలో ఉత్సవాలకు అంకురార్పణ ఘట్టాన్ని పండితుల వేదమంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

గురువారం సాయంత్రం 5:10 నుంచి 5:30 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. ధ్వజ స్తంభంపై ధ్వజపటం ఎగరేస్తూ ఉత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించడంతో బ్రహ్మోత్సవాలు(Brahmotsavam ceremony) ప్రారంభమవుతాయి. రాత్రి 8:30 గంటల నుంచి ఉత్సవాల్లో తొలి వాహనమైన పెద్దశేషవాహనసేవతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. కరోనా ప్రభావంతో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సప్తగిరులు (Brahmotsavam ceremony) ముస్తాబయ్యాయి. తిరుమల విద్యుత్‌ శోభ, ప్రధాన ప్రదేశాల్లో అలంకరణలు ఆకట్టుకున్నాయి.

ఇదీ చూడండి:Tirumala Srivari Brahmotsavam: ఈ సారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహించనున్నారో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details