కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోన్న తరుణంలో ఏపీ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దేశవిదేశాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు సహా తిరుమల ఘాట్ పైకి వెళ్లే భక్తులను థర్మల్ గన్తో పరిశీలించే విధంగా ప్రణాళికలు రచించింది. ప్రత్యేకంగా వైరస్ వ్యాప్తి నివారణ శిబిరాలను ఏర్పాటు చేశారు. వచ్చే ప్రతి భక్తుడి శరీర ఉష్ణోగ్రతను పరిశీలించి... తిరుమలకు పంపే విధంగా ఏర్పాట్లు చేసింది.
కరోనా ఎఫెక్ట్: శ్రీవారి భక్తులకు థర్మల్ గన్తో పరీక్షలు - కరోనా భయం: అప్రమత్తమైన తితిదే
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తితిదే అప్రమత్తమైంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు దేవస్థానం సిబ్బంది థర్మల్ గన్తో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు తిరుమలకు రావద్దని తితిదే సూచించింది. ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న రద్దు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
కరోనా ఎఫెక్ట్: శ్రీవారి భక్తులకు థర్మల్ గన్తో పరీక్షలు