ఆంధ్రప్రదేశ్లో హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని గ్రహించి.. సీఎం జగన్ దేవాలయాలకు శంకుస్థాపనలు, గోపూజలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. లౌకికవాదమే తెలుగుదేశం మూల సిద్ధాంతమని... అయితే ఇటీవల కొన్నివర్గాల తమపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు.
రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక గుర్తింపును జగన్ చెడగొట్టారు: అచ్చెన్నాయుడు - జగన్పై అచ్చెన్నాయుడు కామెంట్స్
రోజుకో వేషంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని.. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
అచ్చెన్నాయుడు
లోక్‌సభ ఉపఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తిరుపతిలో ఏర్పాటుచేసిన పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయాన్ని అచ్చెన్న ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో తిరుపతి లోక్‌సభ పరిధి తెదేపా నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఆ భూములన్నీ ప్రభుత్వానియే : శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్