తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు పునరుద్ధరణ..

కరోనా ప్రభావం స్వల్పంగా తగ్గటంతో ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు పునరుద్ధరిస్తూ.. ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్​ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి జిల్లా కార్యాలయాలు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని వెల్లడించారు.

govt office timings
govt office timings

By

Published : Jul 20, 2021, 7:29 PM IST

కొవిడ్ కారణంగా మార్పులు చేసిన ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు పునరుద్ధరిస్తూ ఏపీ ప్రభుత్వం ​​ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి జిల్లా కార్యాలయాలు, ఇతర ఉపకార్యాలయాలు ఉదయం 10.30 గంటల నుంచి 5 గంటల వరకూ పనిచేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రస్థాయిలో సచివాలయంతో పాటు విభాగాధిపతులు, కార్పొరేషన్లు ఇతర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పనిచేస్తాయని ప్రకటించింది.

కరోనా ప్రభావం స్వల్పంగా తగ్గటంతో పనివేళలు పునరుద్ధరిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. జిల్లా కార్యాలయాలకు ఆదివారం, రెండో శనివారం మాత్రమే సెలవు ఉంటుందని స్పష్టం చేసింది. సచివాలయం, విభాగాధిపతులు, కార్పొరేషన్లకు సంబంధించి రాష్ట్ర కార్యాలయాలు మరో ఏడాది పాటు వారానికి ఐదు రోజులే పనిచేస్తాయని వెల్లడించింది. రెండో దశ కరోనా ప్రభావం, కర్ఫ్యూ అనంతరం ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్ని పునరుద్ధరిస్తూ సీఎస్ ఆదిత్యనాథ్​ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు

ఇదీ చూడండి:delta variant: బీ అలర్ట్‌.. గాలి ద్వారా డెల్టా వేరియంట్‌ వ్యాప్తి

ABOUT THE AUTHOR

...view details