పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ స్థానంలో ముగ్గురు అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. భాజపాలో చేరిన కపిలవాయి దిలీప్‌తో పాటు మల్లారెడ్డి, లక్ష్మినారాయణ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈ స్థానంలో 93 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఈ స్థానంలో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా తెరాస నుంచి సురభి వాణిదేవి, కాంగ్రెస్ - చిన్నారెడ్డి, భాజపా అభ్యర్థిగా రామచందర్‌రావు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ బరిలో ఉన్నారు.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల గడువు ముగియగా.. ముగ్గురు ఉపసంహరించుకున్నారు. ఇక్కడ మొత్తం 76 నామినేషన్లు దాఖలవగా.. ఇద్దరివి తిరస్కరణకు గురయ్యాయి. మరో ముగ్గురు భూక్యా కోట్యా, సామల శశిధర్, బెల్గమ్ నాగరాజు ఉపసంహరించుకున్నారు. ఆ స్థానంలో మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఈ స్థానంలో ప్రధాన పార్టీ అభ్యర్థులుగా తెరాస తరఫున పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి రాములునాయక్, భాజపా తరఫున ప్రేమేందర్‌రెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్, యువ తెలంగాణ పార్టీ అభ్యర్థి రాణి రుద్రమదేవి, స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీలో నిలిచారు.
ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో మార్చి 14న పోలింగ్ జరగనుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఇవీచూడండి:పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు