హైదరాబాద్ పాతబస్తీకి చెందిన యువతి(27)కి గత డిసెంబరులో తలాబ్‌కట్ట నషేమన్‌నగర్‌వాసి అక్బర్‌షా(34)తో టిక్‌టాక్‌లో పరిచయం ఏర్పడింది. యువతిని ప్రేమ పేరిట నమ్మించిన అతడు టోలీచౌకిలోని తన సోదరి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానంటూ బంధువుల సమక్షంలో ఉత్తుత్తి నిశ్చితార్థం చేసుకున్నాడు. మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. తరువాత ఆచూకీ లేకుండా పోవడం వల్ల బాధితురాలు ఆదివారం చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
టిక్‌టాక్‌లో పరిచయం.. పెళ్లి పేరుతో అత్యాచారం - Teenage girl raped in Hyderabad
టిక్‌టాక్‌లో పరిచయమైన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడికి అప్పటికే పెళ్లయి, నలుగురు సంతానం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.

టిక్‌టాక్‌లో పరిచయం.. పెళ్లి పేరుతో అత్యాచారం