Ticket War in Telangana BJP :రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి అధికార, ప్రత్యర్థి పార్టీల మధ్య పోటీ మొదలైంది. అంతేగాక పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు పార్టీలు ఫిరాయించడం మామూలైంది. మేమేమైనా తక్కువా అన్నట్లుగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సైతం తమకు నచ్చని అభ్యర్థులపై బుసలు గక్కుతున్నారు. ఇప్పటికే కొందరు ప్రచారాలను ప్రారంభించారు. ఇటీవల మెదక్ జిల్లా నర్సాపూర్ బీజేపీ ఎమ్మెల్యే టికెట్ మురళి యాదవ్‌కు అధిష్ఠానం కేటాయించింది. దీంతో నియోజకవర్గ బీజేపీ నాయకులు(BJP Leaders) భగ్గుమంటున్నారు. స్వచ్ఛమైన నాయకులు, కార్యకర్తలు ఎవరూ మురళి యాదవ్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేరని అన్నారు.
Election Heat in Telangana BJP 2023 :భూ కబ్జాలకు పాల్పడే వ్యక్తి మురళి యాదవ్ అంటూ ఆరోపణలు గుప్పించారు. మరోవైపు తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, మంచి విద్య, రవాణా, యువతకు ఆట స్థలం, స్పోర్ట్స్ క్లబ్, అన్ని వర్గాలకు మౌలిక వసతులు కల్పిస్తానని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ తెలిపారు. జగిత్యాలలో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ బోగ శ్రావణికి టికెట్ ప్రకటించటంతో ఆమె జగిత్యాలలో ఎన్నిక ప్రచారాన్ని ప్రారంభించారు. తన గెలుపుతో ఈసారి జగిత్యాలలో తొలిసారిగాబీజేపీ జెండా ఎగర వేయటం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
Congress Leader on 6 Guarantees :పదేళ్ల కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ నాయకులు, సొంత కార్యకర్తలకే ఇచ్చుకున్నారని మాజీ మంత్రి, జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఏ.చంద్రశేఖర్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ(Telangana Congress 6 Guarantees)లకు ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందని.. అధికారంలోకి వచ్చాక పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.