తెలంగాణ

telangana

ETV Bharat / state

Ticket Clashes in Telangana Congress : కాంగ్రెస్​లో భగ్గుమంటున్న అసమ్మతి జ్వాలలు.. బరిలో నిలిచి తీరుతామంటున్న ఆశావహ నేతలు

Ticket Clashes in Telangana Congress : కాంగ్రెస్ రెండో జాబితా ప్రకటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీలో అసమ్మతి జ్వాలలు భగ్గుమంటున్నాయి. టికెట్‌ ఆశించి భంగపడ్డ నాయకులు.. తమ అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తూ.. భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటనకు సిద్ధమవుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలుస్తామని కొందరు.. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వేరే పార్టీ నుంచి పోటీ చేస్తామని మరికొందరు తేల్చిచెబుతున్నారు. పార్టీని అంటిపెట్టుకొని ఉన్న తమను కాదని.. ఇతరులకు టికెట్లు ఇవ్వడమేంటని సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

Ticket Clashes in Telangana Congress
Telangana Congress

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2023, 9:53 AM IST

Ticket Clashes in Telangana Congress కాంగ్రెస్​లో భగ్గుమంటున్న అసమ్మతి జ్వాలలు.. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలుస్తామంటున్న నేతలు

Ticket Clashes in Telangana Congress :ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి. టికెట్‌ ఆశించి భంగపడ్డ నాయకులు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. జడ్చర్ల, నారాయణపేట నియోజకవర్గాల నుంచి టిక్కెట్టు ఆశించి భంగపడ్డ ఎర్ర శేఖర్.. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించారు. దేవరకద్రలో మధుసూదన్‌రెడ్డిని మార్చాలని.. లేదంటే పార్టీ నష్టపోవాల్సి వస్తుందని అక్కడి నేతలు అధిష్ఠానానికి సందేశాలు పంపారు. మధుసూదన్​రెడ్డి గెలుపు కోసం శ్రమించేందుకు శ్రేణులు సిద్ధంగా లేరని ఇప్పటికైనా అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు.

వనపర్తిలో నిరంజన్​రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా తూడి మేఘారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. చివరి వరకూ ఆయనకే టిక్కెట్ వస్తుందని అంతా ఆశించినా.. ఆఖరి నిమిషంలో చిన్నారెడ్డి పేరు ప్రకటించడంతో ఒక్కసారిగా శ్రేణుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు నాగర్ కర్నూల్ నుంచి మాజీ మంత్రి నాగం జనార్ధన్​రెడ్డి.. ఇతర పార్టీలో చేరడంపై కార్యకర్తల అభీష్టం మేరకే నడుచుకుంటానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్‌ను బలోపేతం చేసి, పార్టీ ఔన్నత్యాన్ని పెంచిన తనకే టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

Congress Leaders Ticket Clash in Kamareddy :కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో మదన్‌మోహన్‌కు టికెట్ కేటాయించడంతో.. టికెట్‌ ఆశించి భంగపడ్డ వడ్డేపల్లి సుభాశ్​రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. మూడు దఫాలుగా తనకు టికెట్‌ ఇవ్వకుండా మోసం చేశారని అనుచరుల సమక్షంలో సుభాశ్​రెడ్డి కంటతడి పెట్టారు. తాను రెబల్‌ అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో తనతో పాటు రెబల్ అభ్యర్థులను నిలబెడతానన్నారు.

Congress Ticket Clashes in Telangana :లంబాడీల హక్కుల కోసం పోరాటం చేసిన బెల్లయ్య నాయక్‌కు టికెట్‌ కేటాయించాలని లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్‌ చేసింది. ఉద్యమ నాయకుడికి కాంగ్రెస్ టికెట్‌ ఇవ్వకుంటే.. రేవంత్‌రెడ్డి సహా సీతక్కను కూడా ఓడించి తీరుతామని హెచ్చరించింది. యాదవులను విస్మరిస్తే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్‌ ఉండదని అఖిల భారత యాదవ మహాసభ తెలిపింది. అంబర్‌పేట్‌ టికెట్‌ను లక్ష్మణ్ యాదవ్‌కు కేటాయించాలని.. లేదంటే యాదవులంతా కలిసి కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతారని హెచ్చరించింది. కూకట్‌పల్లి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి నిరాశకు గురై.. రాజీనామా చేసిన గొట్టిముక్కల వెంగలరావును పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి బుజ్జగించించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి టికెట్‌ రావాలంటే కుదరుదని సర్ది చెప్పారు. అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Ticket Clashes in Telangana Congress : రెండో జాబితా తెచ్చిన తంటా.. కాంగ్రెస్​కు కొత్త తలనొప్పి!

Munugode Congress MLA Ticket Issue :కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ సెల్‌ ఛైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ సోహెల్ పార్టీని వీడనున్నట్లు ప్రకటించారు. పార్టీలో మైనార్టీలకు తీవ్ర అన్యాయంగా జరుగుతుందని.. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ కోసం పని చేసే వారికి కాకుండా.. డబ్బులు ఉన్న వారికే టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. నల్గొండ జిల్లా మునుగోడులో అసమ్మతి వర్గం భగ్గుమంది. రెండు రోజుల క్రితమే తిరిగి పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి టికెట్‌ కేటాయించడంతో.. టికెట్‌ ఆశిస్తున్న చలమల్ల కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్‌ ఇవ్వకపోయినా మునుగోడు నుంచి కచ్చితంగా పోటీ చేస్తానని తేల్చిచెప్పారు. వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇన్నాళ్లు పదవుల్లో ఉండి జిల్లాకు ఏం చేశారని కృష్ణారెడ్డి ప్రశ్నించారు.

Congress Tickets War in Telangana :మెదక్ జిల్లా నర్సాపూర్ కాంగ్రెస్ టికెట్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డికి కేటాయించడంతో పీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ వర్గంలో అసమ్మతి చెలరేగింది. మూడు రోజుల్లో అభ్యర్థిని మార్చకపోతే.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఆసిఫాబాద్ టికెట్ ఆశించి భంగపడ్డ సరస్వతి, గణేశ్​ రాఠోడ్‌లు అధిష్ఠానంపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని నమ్మితే వారిద్దరినీ కాదని.. దొంగలకు టికెట్ ఇచ్చారని ఘాటు విమర్శలు చేశారు. పార్టీ జెండాలు మోసిన వాళ్లను కాదని వలస వస్తున్న వారికి టికెట్ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఆదివాసీలు సరైన బుద్ధి చెబుతారన్నారని తెలిపారు. ఆసిఫాబాద్‌లో శ్యామ్‌నాయక్‌ను ఓడించి తీరుతామని వెల్లడించారు.

పార్టీ బలోపేతానికి కృషి చేస్తే.. ఇలా మోసం చేస్తారా! : నిర్మల్ జిల్లా ముథోల్‌లో సీనియర్ నాయకుడు విజయకుమార్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన అనుచరులు పార్టీ జెండాలు, కండువాలకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. తనను కాంగ్రెస్ పార్టీ మూడుసార్లు మోసం చేసిందని విజయ్​కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో ఉన్న తనను.. రేవంత్​రెడ్డి పిలిపించి పార్టీ తరఫున ప్రచారాలు నిర్వహించమన్నారని తెలిపారు. ఆరు నెలలుగా గ్రామాలన్నీ తిరిగి పార్టీ బలోపేతానికి కృషి చేస్తే.. ఇలా మోసం చేస్తారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్‌ ఇవ్వకపోయినా తప్పకుండా బరిలో ఉంటానని.. కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని విజయకుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Congress Election Campaign in Telangana 2023 : ప్రచార బరిలోకి దిగిన కాంగ్రెస్​ అభ్యర్థులు.. ఒక్క ఛాన్స్​ ఇవ్వాలంటూ ప్రజల్లోకి..

Telangana Congress MLA Tickets 2023 : కాంగ్రెస్ రెండో జాబితాలో రెడ్డి, బీసీలకు పెద్దపీట.. 10 మంది మహిళలకు ఛాన్స్

ABOUT THE AUTHOR

...view details