హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, బంజారహిల్స్, లక్డీకాపూల్, పంజాగుట్ట, సోమాజిగూడ, రాజేంద్రనగర్, కూకట్పల్లి, ముసాపేట్, అమీర్ పేటల్లో ఓ మోస్తారు వర్షం పడింది. గచ్చిబౌలి, కొండాపూర్, కప్రా, మల్కాజిగిరి, నేరెడీమేట్, చర్లపల్లి, దమ్మాయిగూడ, జవాహర్ నగర్, నాగారంలలో భారీ వర్షం కురిసింది. రోడ్లపై నీరు చేరి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బందిని రంగంలోకి దింపారు.
హైదరాబాద్లో పలుచోట్ల వర్షం... ట్రాఫిక్కు అంతరాయం - హైదరాబాద్లో నేడు పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది
భాగ్యనగరంలో పలుచోట్ల భారీవర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు, పాదచారులు కొద్దిసేపు మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్నారు.
![హైదరాబాద్లో పలుచోట్ల వర్షం... ట్రాఫిక్కు అంతరాయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4709662-282-4709662-1570704303684.jpg)
హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం
నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములతో కూడిన వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, మారేడుపల్లి, బేగంపేట, ప్యాట్నీ, ప్యారడైస్, చిలకలగూడ, పద్మారావు నగర్, సంగీత్ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.
హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం
ఇదీ చూడండి : అప్పుల భయంతో ఆర్టీసీ కండక్టరు భర్త మృతి
Last Updated : Oct 10, 2019, 7:31 PM IST