తెలంగాణ

telangana

ETV Bharat / state

"హైదరాబాద్​లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి" - నగరవాసులు సాధ్యమైనంత మేరకు కార్యాలయాలు, ఇళ్లలోనే ఉండాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ సూచించారు

హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఓ మోస్తారు వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ సూచించారు.

'నగరంలో వర్షంతో పాటు పిడుగులు'

By

Published : Oct 9, 2019, 4:59 PM IST

వాతావరణ శాఖ చెప్పినట్టుగానే హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కూకట్​పల్లి, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, శంషాబాద్, మల్కాజిగిరి, యూసఫ్ గూడ, పంజాగుట్ట, అమీర్​పేట, సోమాజిగూడ ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. వర్షంతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

నగరవాసులు సాధ్యమైనంత మేరకు కార్యాలయాలు, ఇళ్లలోనే ఉండాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ సూచించారు. నగరంలో నీరు నిలిచే ప్రాంతాలు, ఇబ్బందులను వెంటనే తొలగించేందుకు అత్యవసర బృందాలు, విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం చేసినట్టు తెలిపారు. రోడ్లపై నీరు నిలవడం వల్ల నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది.

'నగరంలో వర్షంతో పాటు పిడుగులు'

ఇదీ చూడండి : ఎయిర్​ బస్​పై ఉన్న ప్రేమ ఎర్ర బస్సుపై లేదు

ABOUT THE AUTHOR

...view details