తెలంగాణ

telangana

ETV Bharat / state

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్​ రెడ్డిపై కేసు నమోదు - హైదరాబాద్​ తాజా వార్తలు

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి తెరాస పార్టీకి కోవర్టుగా పనిచేస్తున్నారని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ ఆరోపించారు. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌కు చెందిన పలువురు దళిత నాయకులు బేగంబజార్ ఠాణాలో దామోదర్​ రెడ్డిపై ఫిర్యాదు చేశారు.

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్​ రెడ్డిపై కేసు నమోదు
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్​ రెడ్డిపై కేసు నమోదు

By

Published : Aug 12, 2020, 8:01 PM IST

తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న విభేదాలు తీవ్రం రూపం దాల్చుతున్నాయి. మాజీ మంత్రి దామోదర్​ రెడ్డి అధికార తెరాస పార్టీకి కోవర్టుగా పనిచేస్తున్నారని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్​ ఆరోపించారు.

నియోజకవర్గంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఆ పార్టీ అగ్రనేతలకు.. దళితనాయకుల మధ్య ఇప్పటికే తనకు వస్తున్న బెదిరింపులపై కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులను ఏకం చేసి తమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.

ఇదీ చూడండి : కేంద్ర హోంమంత్రి పతకానికి సీబీఐ హైదరాబాద్​ ఎస్పీ ఎంపిక

ABOUT THE AUTHOR

...view details