హైదరాబాద్ మలక్‌పేటలోని రేస్‌కోర్స్ వద్ద దారుణం చోటుచేసుకుంది. స్థానిక హబీబ్ హోటల్ వద్ద ఫజల్ అనే వ్యక్తిపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు ఫసల్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పట్టపగలే దారుణం... వ్యక్తిపై కత్తులతో దాడి - హబీబ్ హోటల్
ఓ వ్యక్తిపై ఇద్దరు గుర్తుతెలియని దుండగులు కత్తితో దాడి చేశారు.
మలక్‌పేటలో ఓ వ్యక్తిపై కత్తులతో దుండగుల దాడి