తెలంగాణ

telangana

ETV Bharat / state

కేటీఆర్‌ కాలికి గాయం.. మూడు వారాలు విశ్రాంతి.. అభిమానుల్లో నిరుత్సాహం..

KTR
KTR

By

Published : Jul 23, 2022, 5:50 PM IST

Updated : Jul 23, 2022, 6:55 PM IST

17:47 July 23

KTR: కేటీఆర్‌ కాలికి గాయం.. మూడు వారాలు విశ్రాంతి

KTR Leg Injured: రాష్ట్ర ఐటీశాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కాలికి స్వల్ప గాయమైంది. గాయం మానేందుకు మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా తన ట్విట్టర్​ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇవాళ ప్రమాదవశాత్తూ ప్రగతిభవన్​లో జారిపడడంతో గాయమైనట్లు కేటీఆర్​ తెలిపారు. కాలు చీలమండ లిగ్మెంట్‌లో చిన్న చీలిక వచ్చినట్లు వైద్యపరీక్షలో తేలింది. ఆస్పత్రిలో చికిత్స తర్వాత కేటీఆర్ ప్రగతిభవన్ చేరుకున్నారు. ఈ విశ్రాంతి సమయంలో ఓటీటీకి సంబంధించిన కార్యక్రమాలు, సినిమాల గురించి తనకు సలహాలు ఇవ్వాలని అభిమానులను కేటీఆర్ కోరారు.

రేపు కేటీఆర్ జన్మదినం ఉన్న సందర్భంలో ఇలా ఆయన అస్వస్థతకు గురికావటం ఆయన అభిమానులకు బాధకలిగించింది. ఇప్పటికే.. ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరపాలని ఏర్పాట్లు చేసుకున్న అభిమానులు, తెరాస శ్రేణులకు.. మధ్యాహ్నం కేటీఆర్ చేసిన విజ్ఞప్తితో కొంత నిరాశలో ఉన్నారు.​ రాష్ట్రంలో భారీ వరదల కారణంగా ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని.. వరదలతో ఇబ్బందులు పడుతున్న బాధితులకు అండగా నిలవాలని సూచించారు. ఇక.. అస్వస్థత విషయం తెలియటంతో మరింత నిరుత్సాహపడినట్టు తెలుస్తోంది.

నిరాశలో ఉన్నప్పటికీ.. చాలా మంది అభిమానులు, తెరాస కార్యకర్తలు.. కేటీఆర్​కు మద్దతుగా నిలుస్తున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు.. ట్విట్టర్​లో పోస్టులు చేస్తున్నారు. తన విజ్ఞప్తి మేరకు.. సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటామని కేటీఆర్​కు హామీ ఇస్తున్నారు. మరికొంత మంది నెటిజన్లు.. ఓటీటీకి సంబంధించిన సమాచారాన్ని ట్విట్టర్​ వేదికగా కేటీఆర్​తో పంచుకుంటున్నారు.

ఇవీ చదవండి:గెదేను కాపాడబోయి ఒకరు గల్లంతు.. ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలతో గాలింపు

మంత్రి కేటీఆర్​కు మౌత్​ ఆర్టిస్ట్​ స్వప్నిక​ అరుదైన బహుమతి​..!

Last Updated : Jul 23, 2022, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details