అగ్రిగోల్డ్ ఛైర్మన్ సహా ముగ్గురు అరెస్ట్ - అగ్రిగొల్డ్ కేసు
00:00 December 23
అగ్రిగోల్డ్ కేసులో ముగ్గురిని అరెస్టు చేసిన ఈడీ
అగ్రిగోల్డ్ కేసులో ముగ్గురు కీలక నిందితులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ అభియోగాలపై అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు, డైరెక్టర్లు అవ్వా వెంకట శేషు నారాయణ రావు, హేమ సుందర ప్రసాద్‌ను ఈడీ అరెస్టు చేసింది.
ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో సుమారు 9 లక్షల మంది నుంచి... రూ. 6,380కోట్లు మోసానికి పాల్పడినట్టు అగ్రిగోల్డ్‌పై అభియోగం. ఏపీ సీఐడీ దాఖలు చేసిన కేసులు, ఛార్జిషీట్ల ఆధారంగా హైదరాబాద్‌లో ఈడీ విభాగం మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు దర్యాప్తు చేస్తోంది. కుంభకోణం ద్వారా కూడబెట్టుకున్న ఆస్తులను ఈడీ ఆరా తీస్తోంది. ఈ క్రమంలో రామారావు, శేషు నారాయణ రావు, హేమ సుందర వరప్రసాద్‌ను ప్రశ్నించిన ఈడీ అరెస్టు చేసింది.
ఇదీ చూడండి:ఎంపీ అర్వింద్ ర్యాలీలో తల్వార్లతో నృత్యాలు... ఏడుగురిపై కేసు