తెలంగాణ

telangana

ETV Bharat / state

గుప్త నిధుల కోసం ముగ్గురు దారుణ హత్య - anatapur

అనంతపురం జిల్లా తనకొల్లు మండలం కొర్తికోటలో గుప్త నిధుల కోసం ముగ్గుర్ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.

గుప్త నిధుల కోసం ముగ్గురు దారుణ హత్య

By

Published : Jul 15, 2019, 5:26 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొర్తికోటలో ముగ్గరి దారుణ హత్య కలకలం రేపింది. గ్రామంలో శివాలయం వద్ద ఇద్దరు మహిళలు, మరొక వ్యక్తి రక్తపు మడుగులో కనిపించడం భయాందోళనకు దారి తీసింది. శివాలయం గుడికి పూజారిగా శివరామిరెడ్డి ఉన్నారు. అతని అక్క కమలమ్మ అక్కడే ఉంటూ అతనికి వంట చేసిపెడుతుండేది. బెంగళూరులో నివాసం ఉండే సత్యలక్ష్మి నిన్ననే గ్రామానికి వచ్చింది. వీరందర్నీ నిన్న రాత్రి గుడి వద్ద 10 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వారిని అత్యంత కర్కశంగా గొంతు కోసి హత్య చేశారు. తర్వాత వారి రక్తాన్ని గుడిలో ఉన్న శివలింగంపై, పుట్టలపై చల్లినట్టు ఆనవాళు ఉన్నాయి. ఉదయం విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుప్త నిధుల కోసమే ఈ హత్యలు జరిగినట్టు ప్రాథమికంగా తేలింది. కదిరి డీఎస్పీ శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పంపారు.

గుప్త నిధుల కోసం ముగ్గురు దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details