Three People Fraud in Selling Mahindra Car at Lowest Price : తక్కువ ధరకే మహీంద్రా వాహనాలు ఇస్తామంటూ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిని మోసం చేసిన ముగ్గురు నిందితులను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌కు చెందిన రత్నం, సాయి సెక్యూరిటీ సర్వీసెస్(Security Services) అనే కంపెనీ నిర్వహిస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం మహీంద్రా ఆటోమోటివ్ సంస్థ సీఐఈ(CIE)ని అంటూ బాధితుడికి ఫోన్ చేసిన నేరగాళ్లు, అనంతరపురంలో కొత్తగా పరిశ్రమ ప్రారంభిస్తున్నామని తెలిపారు.
Three People Fraud by Mahindra Car Offers : దీనికోసం సెక్యూరిటీ సిబ్బంది కావాలని కోరగా, బాధితుడు కొటేషన్ పంపాడు. తమ వద్ద మహీంద్రా సంస్థ డెమో కార్లు ఉన్నాయని, వార్షిక వేలంలో(Annual Auction) తక్కువ ధరకు విక్రయిస్తున్నామని వారు రత్నంకు తెలిపారు. ఆశపడ్డ బాధితుడు రత్నం వాహనాలు తీసుకుంటానని చెప్పాడు. తమ వద్ద రెండు బొలెరో వాహనాలు ఉన్నాయని, వీటి కోసం రూ. 3.54 లక్షలు కట్టాలని నేరగాళ్లు తెలిపారు.
సైబర్ క్రైమ్స్‌లో మొదటి స్థానంలో తెలంగాణ - ఆర్థిక నేరాలు, ఫేక్ న్యూస్ వ్యాప్తిలోనూ మనమే
Three Men Arrested for Mahindra Car Offer Fraud : దీంతో నేరగాళ్లు తెలిపిన ఖాతాకు బాధితుడు నగదు బదిలీ చేశాడు. అనంతరం నేరగాళ్లు స్పందించకపోవడంతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు, ఏపీలోని రాజమండ్రికి చెందిన నవీన్ కుమార్, కంచర్ల మధు, దుర్గా ప్రసాద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
CyberCrime police Arrest man for AAI Job Fraud :మరోవైపుఉద్యోగాల పేరిట నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు విజయ్‌కాంత్‌ను ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh) నోయిడాలో అరెస్ట్ చేశారు. పోలీసులు అతని వద్ద నుంచి ఆరు ల్యాప్‌టాప్‌లు, 23 చరవాణులు, 8 చెక్‌బుక్‌లు, 80 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.