తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Omicron Cases: రాష్ట్రంలో మరో 3 ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు నమోదు - Telangana news

OMICRON
ఒమిక్రాన్

By

Published : Dec 25, 2021, 7:45 PM IST

Updated : Dec 25, 2021, 8:16 PM IST

19:43 December 25

రాష్ట్రంలో మొత్తం 41 కి చేరిన ఒమిక్రాన్ కేసులు

Telangana Omicron Cases: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు చాపకింద నీరులా రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో 3 ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కేసులు సంఖ్య 41కి చేరింది. ఒమిక్రాన్ బారిన పడి 10 మంది బాధితులు కోలుకున్నారు. 41 మంది బాధితుల్లో 14 మంది రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారు కాగా... 26 మంది నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చారు. మరొకరు కాంటాక్ట్ ఒమిక్రాన్ బాధితులని వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

140 కరోనా కేసులు...

రాష్ట్రంలో కొత్తగా మరో 140 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి కోలుకుని మరో 180 మంది బాధితులు ఇళ్లకు వెళ్లారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,499 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ 26,947మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... 140 కొత్త కేసులు బయటపడ్డాయి.

ఇవీ చూడండి:

Last Updated : Dec 25, 2021, 8:16 PM IST

ABOUT THE AUTHOR

...view details