TSPSC Paper Leakage Case Updte : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు వేగం పెంచారు. వరుస అరెస్టులు చేస్తూ.. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో తీగ లాగితే డొంకంతా కదిలినట్లు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతే కాకుండా ఈ లీకేజీ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో సిట్ లోతుగా దర్యాప్తు చేస్తుంది.
TSPSC Paper Leakage Case : TSPSC పేపర్ లీక్ కేసులో మరో ముగ్గురు అరెస్టు
19:54 May 16
TSPSC Paper Leakage Case : టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో మరో ముగ్గురు అరెస్టు
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వెనుక ఉన్న సూత్రధారులెవరు?: ఈ క్రమంలోనే టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో తాజాగా సిట్ అధికారులు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. సిట్ అధికారులు క్రాంతి, రవితేజ, శశిధర్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే ఏఈఈ ప్రశ్నపత్రాన్ని మురళీధర్ వద్ద క్రాంతి, శశిధర్ కొనుగోలు చేశారు. అలాగే డీఏవో ప్రశ్నపత్రాన్ని సాయిలౌకిక్ వద్ద రవితేజ కొనుగోలు చేశారు.
అలాగే మే 9న సిట్ అధికారులు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. నలుగురు కూడా ఏఈ, ఏఈఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. దీంతో ఇప్పటికీ మొత్తం ఈ కేసులో అరెస్టుల సంఖ్య 30కు చేరింది. ఈ నలుగురు నిందితులు కూడా ప్రవీణ్, డాక్యా నుంచి ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, డాక్యా నాయక్, రాజేశ్వర్ నాయక్‌లను రెండు సార్లు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించినా ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి పెద్దగా వివరాలు వెల్లడించలేదు. దీంతో సిట్ అధికారులు సాంకేతికతను ఆధారంగా చేసుకొని దర్యాప్తు నిర్వహించారు.
టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన ఉద్యోగ పరీక్షల పేపర్ లీకేజీ ఘటనలో అసలైన నిందితులను దొరకపట్టడంలో సిట్ విఫలమైందని.. లీకేజీ వెనుక ఉన్న అసలైన సూత్రధారులెవరో దొరకబట్టాలని డిమాండ్ చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఈడీ డైరెక్టర్ని కలిసి ఫిర్యాదు చేశారు. 30 లక్షల మంది నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకున్న ద్రోహులను వదిలిపెట్టేది లేదన్నారు. అందుకే మరింత లోతైన విచారణ జరపాలని కోరుతూ.. వారు ఈడీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తామని అధికారులు తెలిపారని.. మరోవైపు లీకేజీ కేసులో నిందితులు కొందరు ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారన్నారు. లీకేజీ కేసులో విచారణ ఎదుర్కొన్న కమీషన్ చైర్మెన్, సభ్యుల సమక్షంలోనే మళ్లీ పరీక్ష నిర్వహించడంపై అభ్యర్థులు చాలా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధులు డా.వెంకటేష్ చౌహాన్, ఆరుణ క్వీణ్, సంజయ్ ఈడీ ఆఫీసులో డైరెక్టర్‌కు లేఖ అందజేశారు.
ఇవీ చదవండి: