Three More Arrested in Pallavi Prashanth Case :బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. సరూర్‌నగర్‌కు చెందిన విద్యార్థి అవినాష్ రెడ్డి, యూసఫ్‌గూడకు చెందిన సుధాకర్, ఇందిరానగర్‌లో ఓ ఆస్పత్రిలో ఆఫీస్ బాయ్‌గా పని చేస్తున్న పవన్ అనే మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించగా చంచల్‌గూడ జైలుకు తరలించారు.
సన్‌బర్న్ ఈవెంట్ వివాదం - బుక్ మై షోపై ఛీటింగ్ కేసు నమోదు
Bigboss Winner Pallavi Prashanth Case Updates :బిగ్‌బాస్ విజయం అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ సమీపంలో పల్లవి ప్రశాంత్ సహా అతని అభిమానులు హంగామా సృష్టించారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు ఒక కేసులో పల్లవి ప్రశాంత్ సహా 5గురు వ్యక్తులను, మరో కేసులో నలుగురు మైనర్లు సహా 16 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. కాగా నమోదైన రెండు కేసుల్లో ఇప్పటి వరకూ పల్లవి ప్రశాంత్ సహా 24 మందిని అరెస్ట్ చేశారు.
మరోవైపు హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచిబిగ్ బాస్-7(Bigboss) విన్నర్ పల్లవి ప్రశాంత్ విడుదలయ్యారు. నాంపల్లి కోర్టు పల్లవి ప్రశాంత్‌కు శుక్రవారం బెయిల్ మంజూరు చేయగా, జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ కేసులో భాగంగా ప్రతి నెల ఒకటి, 16వ తేదీ జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరుకావాలని, రూ.15 వేల చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని నాంపల్లి కోర్టు ప్రశాంత్‌ను ఆదేశించింది.