తెలంగాణ

telangana

ETV Bharat / state

'ద్విచక్రవాహనాలు దొంగిలిస్తున్న మైనర్ల అరెస్ట్​' - Three Minor Thieves Arrest Hyderabad Narayanguda Police

ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ముగ్గురు మైనర్లను హైదరాబాద్ నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. వారిని జువైనల్​ హోంకి తరలించారు.

Narayanguda ps
Narayanguda ps

By

Published : Mar 9, 2020, 8:47 PM IST

హైదరాబాద్ నారాయణగూడ పోలీసులు... ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ముగ్గురు మైనర్లను అరెస్ట్​ చేశారు. విఠల్ వాడీకి చెందిన అరుణ్​కుమార్ తన హోండా డియో బైక్ పంక్చర్ కావడం వల్ల... సమీపంలోని జలమండలి కార్యాలయం వద్ద ఈ నెల 5న నిలిపి ఉంచాడు. ఇది గమనించిన కాచిగూడకు చెందిన ముగ్గురు మైనర్లు ఆ వాహనాన్ని దొంగిలించారు.

బూడిద రంగులోని వాహనాన్ని నీలి రంగులోకి మార్చి ఈ ముగ్గురు ఆ బైక్​పై ఇదే ప్రాంతంలోని వేంకటేశ్వరనగర్​లో తిరుగుతున్నారు. అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయగా... బైక్​ని దొంగలించినట్లు ఒప్పుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు... జువైనల్ హోంకి తరలించారు.

'ద్విచక్రవాహనాలు దొంగిలిస్తున్న మైనర్ల అరెస్ట్​'

ఇదీ చూడండి :డబ్బు, నగలున్న బ్యాగు ఆటోలో మరిచిపోయాడు.. ఆ తర్వాత!

ABOUT THE AUTHOR

...view details