తెలంగాణ

telangana

ETV Bharat / state

10 మంది మృతి.. 300 మందికి అస్వస్థత - latest gas leakages

three-members-dead-due-to-gas-leakage-in-vishakapatnam
10 మంది మృతి.. 300 మందికి అస్వస్థత

By

Published : May 7, 2020, 7:05 AM IST

Updated : May 7, 2020, 8:30 PM IST

07:01 May 07

10 మంది మృతి.. 300 మందికి అస్వస్థత

ముగ్గురు మృతి.. ఇళ్లలోనే వందల మంది...

ఏపీలోని విశాఖలో ఆర్‌.ఆర్‌.వెంకటాపురం గ్యాస్‌ లీక్‌ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. విజయనగరం జిల్లా కొత్తవలస ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి చనిపోయాడు.  మృతుడు ఎల్జీ పాలిమర్స్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. గ్యాస్ లీక్‌ తర్వాత కొత్తవలసలోని బంధువుల ఇంటికి బయల్దేరాడు. ద్విచక్రవాహనంపై వెళ్తూ చింతలపాలెం చెక్‌పోస్ట్‌ వద్ద అస్వస్థతకు గురయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని ఓ హెడ్‌కానిస్టేబుల్ కొత్తవలస పీహెచ్‌సీలో చేర్చాడు. చికిత్సపొందుతూ మృతిచెందాడు.   

మృతుల్లో ఇద్దరు వృద్ధులు, ఎనిమిదేళ్ల చిన్నారి ఉన్నారు. వాయు ప్రభావంతో కళ్లు కనపడక గంగరాజు బావిలో పడి చనిపోయాడు.  

రసాయన వాయు ప్రభావంతో ఆవులు, దూడలు మత్యువాతపడ్డాయి. చెట్లు మాడిపోయాయి. వందల సంఖ్యలో బాధితులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కేజీహెచ్ వైద్యులు చెబుతున్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది తలుపులు బద్దలు కొట్టి ఇళ్లలోకి వెళ్లి కాపాడారు. 
 

 ఇవీచూడండి:మందు భామలం మేము.. క్యూ కడతాము..!

Last Updated : May 7, 2020, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details