ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ఇవాళ సమావేశమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన వేతనసవరణ, పదవీవిరమణ వయసు పొడిగింపు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.
ఉద్యోగుల వేతనసవరణపై త్రిసభ్య కమిటీ భేటీ - ఉద్యోగుల వేతన సవరణపై సీఎస్ అధ్యక్షతన సమావేశం
వేతనసవరణ, ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ఇవాళ సమావేశమైంది. సీఎం ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఉద్యోగుల వేతనసవరణపై త్రిసభ్య కమిటీ భేటీ
వేతనసవరణ సంఘం ఇచ్చిన నివేదిక, ఉద్యోగ సంఘాలతో చర్చలు, ఇతర అంశాలపై ప్రధాన చర్చ జరిగింది. ఉద్యోగ సంఘాలతో చర్చలకు సంబంధించిన షెడ్యూల్ను కూడా కమిటీ రూపొందించింది. ఈ సమావేశంలో ఆర్థిక, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్ కుమార్ పాల్గొన్నారు.