తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీకాళహస్తి అర్చక వివాదంపై త్రిసభ్య కమిటీ - చిత్తూరు జిల్లా వార్తలు

ఏపీలోని శ్రీకాళహస్తి అర్చక వివాదంపై త్రిసభ్య కమిటీని నియమించి నివేదిక ఇవ్వాలని ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. ఆలయంలో పొరుగు సేవకునిగా అర్చక బాధ్యతలు చేపట్టిన వ్యక్తి స్వామివారి గర్భాలయంలోకి వెళ్లిన అంశంపై ప్రధాన దీక్షితులు గురుకుల్ స్వామినాథన్.. ఆలయ ఈవోకి తెలియజేశారు.

three man committee on  srikalahasti Priest Controversy in chittoor district
శ్రీకాళహస్తి అర్చక వివాదంపై త్రిసభ్య కమిటీ

By

Published : Jul 4, 2020, 8:48 PM IST

ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తలెత్తిన అర్చక వివాదం జఠిలమవుతోంది. ముక్కంటికి జరిగిన అపచారంపై తెలియజేయడానికి ఆలయ అనువంశిక ప్రధాన దీక్షితులు గురుకుల్ స్వామినాథన్.. ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది.

ఆలయంలో పొరుగు సేవకునిగా అర్చక బాధ్యతలు చేపట్టిన వ్యక్తి స్వామివారి గర్భాలయంలోకి వెళ్లిన అంశాన్ని ఈవోకు తెలియజేశారు. భక్తుల నుంచి సంకల్పం తీసుకోవడం, ముక్కంటి ప్రధాన లింగం పానవట్టంపై బిల్వ పత్రాలు, పుష్పాలతో అర్చన చేయడం వాటిని తిరిగి మళ్లీ భక్తులకు ఇవ్వడం వంటి అంశాలను ప్రధాన అర్చకుడు ఈవోకు తెలియజేశారు. దీనిపై స్పందించిన ఈవో.. త్రిసభ్య కమిటీని నియమించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

ఇవీ చూడండి: కంటోన్మెంట్​లోనూ ప్రభుత్వ పథకాల అమలు: తలసాని, మల్లారెడ్డి

ABOUT THE AUTHOR

...view details