ఏపీలోని అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం రాఘవమ్మపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందాారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం.. - anantapur latest news
రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని చూడడానికి వచ్చి వారు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగింది. ఈ కేసులో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

బత్తలపల్లి నుంచి రాఘవమ్మపల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రాజశేఖర్ అనే యువకుడిని.. వెనక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. దీంతో రాజశేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. యువకుడి మృతదేహాన్ని చూసేందుకు అదే ప్రాంతంలో ఉన్న శ్రీనివాసులు, శివమ్మ రాగా వారిపైకి అనంతపురం నుంచి కదిరి వైపు వెళ్తున్న లారీ దూసుకొచ్చింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వారిని బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు.
ఇదీ చదవండి:ఆర్థిక ఇబ్బందులు తాళలేక బలవన్మరణం