తెలంగాణ

telangana

ETV Bharat / state

వనస్థలిపురంలో వెల్లువలా వరద ...జలదిగ్భంధంలో 300 ఇళ్లు - హరిహరపురం కాలనీలో వరద నీరు

హైదరాబాద్ వనస్థలిపురంలోని పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. హరిహరపురం కాలనీలో దాదాపు 300 ఇళ్లు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. రహదారులపై భారీగా వరద నీరు నిలవడంతో సహాయచర్యలకు అటంకం ఏర్పడింది.

Three hundred houses in flood water in vanasthalipuram
వనస్థలిపురంలో వెల్లువలా వరద ...జలదిగ్భంధంలో 300 ఇళ్లు

By

Published : Oct 14, 2020, 10:35 AM IST

హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో హరిహరపురం కాలనీ పూర్తిగా జలదిగ్భంధంలో చిక్కుకుంది. కాలనీలో సుమారు 300 ఇళ్లు వరద ముంపులోనే ఉన్నాయి. పూర్తిగా వరద నీటిలోనే కార్లు, ద్విచక్ర వాహనాలు మునిగిపోయాయి.

రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో సహాయ చర్యలకు తీవ్ర అటంకం కలుగుతోంది. కాప్రాయి చెరువుకు గండి పడుతుందనే భయంతో పది కాలనీల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తక్షణమే పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్థానికులు అధికారులను వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:జంటనగరాల్లో పాత రికార్డులు బద్ధలు

ABOUT THE AUTHOR

...view details