ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా కశింకోట మండలం గొబ్బూరు జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వీరిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్టు పోలీసులు గుర్తించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. బుచ్చయ్యపేట మండలం శివరామపురం గ్రామానికి చెందిన ఉరిటి నాగేశ్వరరావు, నమ్మి సతీష్, నమ్మి నాగఅప్పారావుతో పాటు నమ్మి దేవుళ్లు సరుగుడు తోటలో కర్ర కొట్టడానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కూలీల మృతి - విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కూలీల మృతి
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా కశింకోట మండలంలో విషాదం నింపింది.
విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కూలీల మృతి
ప్రమాదంలో ఉరిటి నాగేశ్వరరావు, నమ్మి సతీష్, నమ్మి నాగ అప్పారావు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నమ్మి దేవుళ్లును చికిత్స నిమిత్తం ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు.