ఏపీలో శానిటైజర్ మరణాలు ఆగడం లేదు. మద్యానికి బానిసై మందు దొరక్క వ్యసనపరులు శానిటైజర్ తాగుతున్నారు. కడప జిల్లా పెండ్లిమర్రికి చెందిన ముగ్గురు శానిటైజర్ తాగి మృత్యువాత పడ్డారు. నిన్న శానిటైజర్ తాగి ఇద్దరు మరణించారు. ఇవాళ మరో వ్యక్తి మృతి చెందాడు.
కడప జిల్లాలో శానిటైజర్ తాగి ముగ్గురు మృతి - sanitizer deaths in kadapa district
ఆంధ్రప్రదేశ్లో శానిటైజర్ మరణాలు పెరుగుతున్నాయి. మద్యానికి బానిసైన మందుబాబులు ప్రస్తుత పరిస్థితుల్లో దొరక్క శానిటైజర్ తాగుతున్నారు. ఆదివారం శానిటైజర్ తాగి ఇద్దరు మరణించగా.. తాజాగా సోమవారం మరొకరు మృతి చెందారు. వీరు వారం రోజుల నుంచి శానిటైజర్ తాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
కడప జిల్లాలో శానిటైజర్ తాగి ముగ్గురు మృతి
వారం రోజుల నుంచి ఆరుగురు శానిటైజర్ తాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు చనిపోవడం వల్ల వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
ఇవీ చూడండి: తల్లి పాలు శిశువులకు ఎంతో ఆరోగ్యకరం: గవర్నర్ తమిళిసై