తెలంగాణలో రాగల మూడు రోజుల వరకు వాతావరణం ఎలా ఉండబోతోందో హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఆగ్నేయ ఉత్తరప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వివరించింది.
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు - రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు
రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదివారం తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు
దాని ప్రభావంతో శుక్రవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. శని, ఆదివారాల్లో కొన్నిచోట్ల గంటకు 30 నుంచి 40 kmph వేగంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.