ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రేపు దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే సూచన మరింత బలపడి 16వ తేది సాయంత్రానికి తుపానుగా మారనుందని వాతావరణశాఖ వెల్లడించింది. మే 17 నాటికి వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశముందని... 18,19 తేదీల్లో ఉత్తర బంగాళాఖాతం వైపు వెళ్లే అవకాశముందని పేర్కొంది. రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం - వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్రంగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం