తెలంగాణ

telangana

ETV Bharat / state

మూడు రోజులు ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు - రాగల మూడు రోజుల్లో వర్షాలు

రాష్ట్రంలో మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర-దక్షిణ ఉపరితల ఆవర్తనం కేరళ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తువరకు కొనసాగుతోందని పేర్కొంది.

Three days of light to moderate rains in telangana
మూడు రోజులు ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు

By

Published : Apr 27, 2021, 2:10 PM IST

తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30-40 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి, ఉత్తర, తూర్పు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది.

ఉత్తర-దక్షిణ ఉపరితల ఆవర్తనం ఈ రోజు ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక నుంచి ఇంటీరియర్‌ కేరళ మీదగా కోమరిన్‌ ప్రదేశం వరకు సముద్ర మట్టానికి 0.9కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని వెల్లడించింది.

ఇదీ చూడండి:కరోనా పరీక్షల పెంపునకు చర్యలు చేపడుతున్నాం: ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details