నారాయణగూడ పోలీస్స్టేషన్లో ముగ్గురు కానిస్టేబుళ్లను సీపీ అంజనీకుమార్ సస్పెండ్ చేశారు. విధుల్లో ఉన్న సమయంలో కానిస్టేబుళ్లు మద్యం సేవించారు. వీరు మద్యం తాగుతుండగా ఓ జవాన్ వీడియో తీశారు. కోపంతో ఊగిపోయిన కానిస్టేబుళ్లు నాగరాజు, విశాల్, శివప్రసాద్... జవాన్‌పై దాడిచేశారు.
విధుల్లో మద్యం సేవించిన ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్ - Cp anjani kumar latest updates
విధుల్లో ఉన్న సమయంలో ముగ్గురు కానిస్టేబుళ్లు మద్యం సేవించినందుకు హైదరాబాద్ సీపీ వారిని సస్పెండ్ చేశారు. వీరంతా నారాయణగూడ ఠాణాలో విధులు నిర్వహిస్తున్నారు.
విధుల్లో మద్యం సేవించిన ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్
బాధితుడి ఫిర్యాదుతో సీపీ విచారణకు ఆదేశించారు. దర్యాప్తులో ఆ ముగ్గురు నిబంధనలు అతిక్రమించారని తేలడంతో... ముగ్గురు కానిస్టేబుళ్లను సీపీ సస్పెండ్ చేశారు.
- ఇదీ చూడండి:మల్కాజిగిరిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య