తెలంగాణ

telangana

ETV Bharat / state

భాగ్యనగరంలో గంజాయి రవాణా.. ముగ్గురి అరెస్ట్‌ - మహానగరంలో గంజాయి రవాణా

హైదరాబాద్ లో గంజాయి రవాణా కలకలం సృష్టించింది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి.. 41 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పురానాపూల్‌ గాంధీ విగ్రహం వద్ద తనిఖీలు నిర్వహించగా ఈవిషయం వెలుగు చూసింది.

Three arrested for marijuana trafficking
భాగ్యనగరంలో గంజాయి రవాణా.. ముగ్గురి అరెస్ట్‌

By

Published : May 23, 2020, 8:03 AM IST

మహానగరంలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుంచి 41 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకృష్ణ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ సీఐ గట్టు మల్లు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం.. పురానాపూల్‌ గాంధీ విగ్రహం వద్ద తనిఖీలు చేపట్టింది.

మంగళ్‌హాట్‌కు చెందిన శివాసింగ్‌, దీపక్‌సింగ్‌, నితిన్‌సింగ్‌ను అరెస్టు చేసి, వారి వద్దనుంచి 41 కిలోల ఎండు గంజాయితో పాటు రెండు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలోనూ ఆయా ఠాణాల్లో కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను షాయినాయత్‌గంజ్‌ పోలీసులకు అప్పగించారు.

ఇదీ చూడండి:హైదరాబాద్​పై పంజా విసురుతున్న కరోనా

ABOUT THE AUTHOR

...view details