హైదరాబాద్ సైదాబాద్‌లోని సాగర్ ప్రధాన రహదారిపై మణికంఠ అనే ఆటో గ్యారేజ్ ఉంది. దీనిలో సల్మాన్ అనే వ్యక్తి గతకొంత కాలంగా పనిచేస్తున్నాడు. అతడు మద్యానికి బానిసై డబ్బులు ఇవ్వాలంటూ తరుచూ యాజమాని దేవ్ సింగ్ నాయక్‌తో గొడవ పడేవాడు.
మద్యం మత్తులో తల్వార్లతో యాజమానికి బెదిరింపు - Threats to ownership with talwars in alcohol intoxication
హైదరాబాద్ సైదాబాద్‌లో ఆటో గ్యారేజ్ యజమానిపై మద్యం మత్తులో తల్వార్లతో వర్కర్స్ బెదిరించారు. మద్యానికి డబ్బులు ఇవ్వాలంటూ సల్మాన్ అనే వ్యక్తి తరచుగా గొడవపడుతుండే వాడని యాజమాని బంధువులు పోలీసులకు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![మద్యం మత్తులో తల్వార్లతో యాజమానికి బెదిరింపు Threats to ownership with talwars in alcohol intoxication](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5607292-582-5607292-1578272126925.jpg)
మద్యం మత్తులో తల్వార్లతో యాజమానికి బెదిరింపు
ఈ నేపథ్యంలో ఇవాళ సాయత్రం నాలుగు గంటల సమయంలో తన సోదరునితో వచ్చి యాజమానిపై తల్వార్లతో బెదిరించటం జరిగింది. భయభ్రాంతులకు గురైన యజమాని బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో తల్వార్లతో యాజమానికి బెదిరింపు