Threatening Calls To MLA Raja Singh: తనకు బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయని డీజీపీకి ఫిర్యాదు చేస్తే.. ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. అలా అయితే కమాండ్ కంట్రోల్ రూమ్ ఎందుకు కట్టారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్రాకింగ్ చేయడానికి కట్టారా అంటూ ధ్వజమెత్తారు.
ఎంఐఎంకు టెర్రిరిస్టుల ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టే.. పోలీసులు పట్టించుకోవడంలేదని రాజాసింగ్ ఆరోపించారు. రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యానని.. అది తనకు చాలని అన్నారు. తెలంగాణ యువత ఆశీర్వదిస్తే ధర్మం కోసం పోరాడతానని స్పష్టం చేశారు. మళ్లీమళ్లీ బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయని చెప్పారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించాలని కోరారు.
బీఆర్ఎస్ పార్టీ వాళ్లు బీజేపీ, కాంగ్రెస్‌తో రహస్యంగా సంప్రదింపులు జరుపుతారని ఫోన్లు ట్రాక్ చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యేకే బెదిరింపు కాల్స్ వస్తే సరిగ్గా పట్టించుకోని ప్రభుత్వం మరి సాధారణ ప్రజలను ఏం రక్షిస్తుందని దుయ్యబట్టారు. ధర్మం, సమాజ సేవ చేయడం గురించే పాటుపడడం తన అభిమతమని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు.
అసలేం జరిగింది:తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. డీజీపీ అంజినీకుమార్కు లేఖ రాయడం ఇటీవల హాట్ టాపిక్‌గా మారింది. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. హైదరాబాద్‌లో స్లీపర్ సెల్స్ ఉన్నారని.. అతిత్వరలో నీ అంతు చూస్తామంటూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. వారు తన రోజు వారి కార్యకలాపాలు, కుటుంబసభ్యుల గురించి చెబుతున్నారని అన్నారు.
వారు ఏ నంబర్ నుంచి ఫోన్, మెసేజ్‌లు చేశారో అవి డీజీపీ పంపానని చెప్పారు. తనకిచ్చిన బుల్లెట్ ప్రూప్ వాహనం తరచూ మరమ్మత్తులకు గురై.. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోలేదని తెలిపారు. తుపాకీ గురించి లైసెన్స్ గురించి ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా.. తిరస్కరించారన్నారు. ట్విటర్లో పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి బెదిరించారని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.
"నాలుగైదు రోజుల నుంచి నాకు బెదిరింపు వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి. అదే విధంగా వాట్సాప్ మెసేజ్‌లు కూడా వస్తున్నాయి. డీజీపీకి చాలా సార్లు ఫిర్యాదు చేశాను. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరినీ పట్టుకోలేదు. అసలు అంతపెద్ద కమాండ్ కంట్రోల్ రూమ్ ఎందుకు కట్టాము. ప్రజలను మభ్యపెట్టడానికా.. లేక బీజేపీ, కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్రాప్ చేయడానికా." - రాజాసింగ్, గోషామహల్ ఎమ్మెల్యే
చంపుతామని మళ్లీమళ్లీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఇవీ చదవండి: