తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా బాధితుల్లో రక్తం గడ్డకట్టే ముప్పు! - corona news

కరోనా వ్యాధి రోజురోజుకు విజృంభిస్తోంది. కరోనా బారిన పడేవాళ్లలో తొలుత ఊపిరితిత్తులకే ఎక్కువ నష్టం ఉంటుందని వైద్యులు భావించారు. అయితే కరోనా బాధితుల్లో రక్తం గడ్డకట్టే ముప్పు ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Threat of blood clots in corona victims
కరోనా బాధితుల్లో రక్తం గడ్డకట్టే ముప్పు!

By

Published : Jul 31, 2020, 2:07 PM IST

కరోనా సోకిన 25-30 శాతం బాధితుల్లో రక్తం గడ్డకట్టి వివిధ అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని కిమ్స్‌ చీఫ్‌ కన్సల్టెంట్‌ వాస్క్యులర్‌, ఎండో వాస్క్యులర్‌ నిపుణులు డాక్టర్‌ నరేంద్రనాథ్‌ మేడా తెలిపారు.

రక్తం గడ్డలు మెదడులో ఉంటే స్ట్రోక్‌ (పక్షవాతం), నరాల్లో ఉంటే డీప్‌ వెయిన్‌ త్రంబోసిస్‌ (డీవీటీ), రక్త నాళాల్లో ఉంటే అక్యూట్‌ లింబ్‌ ఇష్కేమియాకు దారితీస్తాయని తెలిపారు. రక్తనాళాల్లో గడ్డలు ఉంటే గుండెకు సరిగా రక్తం చేరక వైఫల్యం చెందే అవకాశం ఉందన్నారు.

వైరస్‌ వల్ల తొలుత ఊపిరితిత్తులకే ఎక్కువ నష్టం ఉంటుందని భావించారు. రక్తం గడ్డకట్టడం వల్ల శరీరంలోని మెదడు, మూత్రపిండాలు, కాలేయం, గుండె, పేగులు తదితర ఇతర భాగాలపైనా దాడి చేస్తుందని వివరించారు. గుండె లయ తప్పడం(మయోకార్డిటిస్‌), గుండె కండరాల బలహీనత(కార్డియో మయోపతి), ఊపిరితిత్తుల్లో ద్రవాలు చేరడం, గుండెపై ఇన్‌ఫెక్షన్‌, వాపు(పెరికార్డియల్‌ ఇన్వాల్వ్‌మెంట్‌)తోపాటు శరీరంలోని వివిధ భాగాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల కూడా మరణాలు సంభవిస్తున్నాయి.

హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి కాళ్లు వాచినా, ఉన్నట్టుండి నొప్పి పుట్టినా, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది తలెత్తినా వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా విశ్రాంతిలో ఉన్నవారు నిమిషానికి 20 సార్లు ఊపిరి తీసుకున్నా, లేదంటే ఆక్సిజన్‌ శాతం 93 కంటే తగ్గినా అప్రమత్తం కావాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details