ఉప్పుగూడ డివిజన్లో ఒకే పోలింగ్ బూత్‌లో ఉండాల్సిన భార్యాభర్తల ఓట్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు మారాయని భాజపా సీనియర్ నాయకులు పొన్న వెంకటరమణ పేర్కొన్నారు. ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఉప్పుగూడకు సంబంధించిన కొంత మంది ఓట్లు జంగంమేట్లో కనిపిస్తున్నాయన్నారు.
'వేల మంది ఓట్లు మరొక డివిజన్‌కు మార్పు' - Division change of 3 thousand voters in Uppuguda
శాలిబండ డివిజన్లో ఒక ప్రాంతానికి సంబంధించిన పోలింగ్ స్టేషన్ ఓట్లు మరో డివిజన్లో ఉన్నాయని భాజపా సీనియర్ నాయకులు పొన్న వెంకటరమణ పేర్కొన్నారు. ఎన్నికల ముందు అనేక సార్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. ఉప్పుగూడ డివిజన్లో సైతం మార్పులు ఉన్నాయని తెలిపారు.

'వేల మంది ఓట్లు మరొక డివిజన్‌కు మార్పు'
ఇదే డివిజన్లో సుమారు మూడు వేల ఓట్లు గౌలిపురకు మార్చారని తెలిపారు. వాటిని ఇప్పటివరకు సరిచేయకుండా హడావుడిగా ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంతర్యం ప్రజలందరికీ అర్థమవుతుందని.. మేయర్ పీఠాన్ని మజ్లిస్‌కు కట్టబెట్టడానికే ఈ కుట్రలు చేశారన్నారు. ఈ ఎన్నికల్లో తెరాస, మజ్లిస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
'వేల మంది ఓట్లు మరొక డివిజన్‌కు మార్పు'
ఇదీ చూడండి :51వేల మంది పోలీసులతో బల్దియా పోరుకు భద్రత