లాక్‌డౌన్ సడలింపుల తర్వాత హోటళ్లు ప్రారంభమైనప్పటికీ... చాలా మంది ఉపాధి కోల్పోయినట్లు నిపుణులు తెలిపారు. కరోనా ప్రభావంతో హోటళ్లకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గటంతో... యజమానులు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. సిబ్బందిని తొలగిస్తున్నారని వంట చేసే వాళ్లు తెలిపారు. ఇప్పటికే సుమారు లక్ష మందిని తొలగించినట్లు పేర్కొన్నారు.
సడలింపులు ఇచ్చినప్పటికీ... కుదురుకోని హోటళ్లు - corona effect on hotels
కరోనా ప్రభావం అన్నిరంగాలపై పడింది. దాదాపు మూడు నెలల తర్వాత తెరుచుకున్న హోటళ్లు.. జనాలు లేక వెలవెలబోతున్నాయి. వైరస్ వల్ల ప్రజలు హోటళ్లకు రావాలంటే జంకుతున్నారు.
సడలింపులు ఇచ్చినప్పటికీ... కుదురుకోని హోటళ్లు