సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్వగ్రామాలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సూచించారు. నగరంలో రాత్రి వేళల్లో పెట్రోలింగ్, నిఘా అధికం చేసినట్టు సీపీ పేర్కొన్నారు. స్వగ్రామాలకు వెళ్లే వారు ఆ సమాచారాన్ని సామాజిక మాధ్యమాలు, వాట్సాప్‌లో ప్రచారం చేయవద్దని... వాటిని నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.
సంక్రాంతికి ఊరికెళితే ముందే చెప్పండి: సీపీ
స్వగ్రామాలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సీపీ పలు సూచనలు చేశారు.
స్వగ్రామాలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలి: సీపీ అంజనీకుమార్
గ్రామాలకు వెళ్లాలనుకునే వారు ఆయా కాలనీల సంక్షేమ సంఘాలు, స్థానిక పోలీసుస్టేషన్‌లలో ముందస్తు సమాచారం ఇవ్వాలని అంజనీకుమార్ కోరారు.
ఇవీచూడండి:కొండెక్కిన సంక్రాంతి సరకులు.. 50%పైగా పెరిగిన ఖర్చు