TSRTC children New year offer : నూతన సంవత్సరం సందర్భంగా టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించిన విషయం తెల్సిందే. నేడు రాష్ట్రంలో 12 ఏళ్ల లోపువారు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పిల్లలతో పాటు తల్లిదండ్రుల్లో ఒకరు విధిగా ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. నూతన సంవత్సరం కానుకగా సంస్థ కల్పిస్తున్న అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ ఉచిత ప్రయాణం అన్ని రకాల బస్సులకు వర్తిస్తుందని పేర్కొన్నారు.
ఈవెంట్స్ జరిగే ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు..
నూతన సంవత్సరం సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ప్రధానంగా నగర శివారులో ఉన్న ఈవెంట్స్ జరిగే ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు ఆర్టీసీ సంస్థ వెల్లడించింది.
వెళ్లి రావటానికి రూ.4 వేల ప్యాకేజీ..
18 సీట్ల ఏసీ బస్సులో వెళ్లి రావటానికి రూ.4 వేల ప్యాకేజీని ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.100 వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ఆర్టీసీ సూచించిన 15 ప్రాంతాల్లో బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. సికింద్రాబాద్ -మేడ్చల్, సికింద్రాబాద్-శామీర్ పేట, ఉప్పల్-కొండాపూర్, దిల్సుఖ్ నగర్ -లింగంపల్లి, లింగంపల్లి-మాదాపూర్, మెహదీపట్నం-శిల్పారామం, కోటీ-రామోజీ -మౌంట్ ఒపెరా, కోటీ-ఓషియన్ పార్క్, లింగంపల్లి-ట్యాంక్ బండ్, దిల్సుఖ్ నగర్ -ట్యాంక్ బండ్, మేడ్చల్-ట్యాంక్ బండ్, మెహదీపట్నం-శంకర్ పల్లి, విప్రో సర్కిల్-మైత్రీవనం, కోటీ-కొండాపూర్ వయా జర్నలిస్ట్ కాలనీ.. దుర్గం చెరువు.. ఐక్యా, లింగంపల్లి-సికింద్రాబాద్ రూట్లలో ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.
ఇదీ చదవండి:TSRTC Employees Retirement 2021 : తెలంగాణ ఆర్టీసీలో పదవీ విరమణ పొడిగింపు లేనట్టే!