తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆ నిబంధనలు ట్రాక్టర్లకు వర్తించవు' - ట్రాక్టర్లకు బీఎస్ 4 రూల్స్ వర్తించవు

బీఎస్- 4, బీఎస్- 6 నిబంధనలు ట్రాక్టర్లకు వర్తించవని తెలంగాణ ట్రాక్టర్ డీలర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్ తెలిపింది. ట్రాక్టర్లు, పవర్‌ టిల్లర్స్‌, కంబైన్డ్‌ హార్వెస్టర్ వాటి విడి భాగాలకు ఈ నిబంధనలు వర్తించవని పేర్కొంది.

'Those regulations don't applicable to tractors'
'ఆ నిబంధనలు ట్రాక్టర్లకు వర్తించవు'

By

Published : Mar 16, 2020, 6:47 PM IST

ట్రాక్టర్లకు బీఎస్- 4, బీఎస్- 6 నిబంధనలు వర్తించవని తెలంగాణ ట్రాక్టర్ డీలర్స్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్ స్పష్టం చేసింది. ట్రాక్టర్లు, పవర్‌ టిల్లర్స్‌, కంబైన్డ్‌ హార్వెస్టర్ వాటి విడి భాగాలకు ఈ నిబంధనలు వర్తించవని అసోషియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వీవీసీ రాజేంద్రప్రసాద్, శేఖర్‌ వివరించారు. ఈ విషయంలో రైతులు భయబ్రాంతులకు గురవుతూ ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ నిబంధన కర్ణాటకలో ఇప్పటికే అమల్లో ఉందని తెలంగాణలో కూడా అమలు చేయాలని వీవీసీ రాజేంద్రప్రసాద్ కోరారు.

భారత దేశంలో ట్రాక్టర్లను కేవలం వ్యవసాయం కోసం మాత్రమే వినియోగిస్తున్నారని చెప్పారు. టీఆర్‌ను పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సుప్రీంకోర్టు కూడా చట్టం ప్రకారమే ముందుకెళ్తామని చెప్పిందని అధ్యక్ష, కార్యదర్శులు వివరించారు. ఆంధ్రప్రదేశ్​లో మాదిరిగా తెలంగాణలో కూడా డీలర్లకే టీఆర్​ను.. పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

'ఆ నిబంధనలు ట్రాక్టర్లకు వర్తించవు'

ఇదీ చూడండి :సీఏఏ వ్యతిరేక తీర్మానానికి శాసనసభ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details