రానున్న మూడు నెలలు.. ఆబ్కారీ, వాణిజ్యపన్నుల శాఖలు రాష్ట్రానికి మరింత ఆదాయాన్ని సాధించేలా కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కోరారు. రెండు శాఖల అధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు. శాఖాపరమైన అంశాలపై చర్చించారు.
రానున్న 3నెలలు మీరు మరింత కృషి చేయాలి : సీఎస్ - వాణిజ్యపన్నుల శాఖ పోస్టులు
ఆబ్కారీ, వాణిజ్యపన్నుల శాఖలు రాష్ట్రానికి మరింత ఆదాయాన్ని సాధించేలా కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కోరారు. ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా రెండు శాఖల్లోనూ భారీగా పోస్టులను మంజూరు చేసిందని గుర్తు చేశారు. కొత్త ఏడాదిలో ఆయా శాఖల ఉద్యోగులు పదోన్నతులు పొందుతారని వివరించారు.
రానున్న 3నెలలు మీరు మరింత కృషి చేయాలి : సీఎస్
ఆదాయ సాధనకు టీంవర్క్తో కృషి చేస్తూ.. ముందుకెళ్తోన్న శాఖలను సీఎస్ అభినందించారు. ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా.. ఎక్సైజ్ శాఖలో 131, కమర్షియల్ టాక్స్ శాఖలో 161 పోస్టులను మంజూరు చేసిందని గుర్తు చేశారు. చాలా పోస్టులను అప్ గ్రేడ్ చేయడం వల్ల సిబ్బందికి పదోన్నతులు లభిస్తాయని వివరించారు. అందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలైందని తెలిపారు.
ఇదీ చదవండి:ఆబ్కారీ శాఖతో.. తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం