నగరంలో చోరీ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిందితులూ తమ చేతి వాటం చూపిస్తూ.. పోలీసులకు సవాలు విసురుతున్నారు. నగరంలో ఈ మధ్య కొత్త తరహా దొంగతనాలకు తెర లేపారు బీహార్‌కు చెందిన కొందరు కేటుగాళ్లు.
ఇంట్లో పనివారిగా చేరి చోరీలు చేస్తున్న ముఠా అరెస్ట్ - latest crime news in hyderabad
![ఇంట్లో పనివారిగా చేరి చోరీలు చేస్తున్న ముఠా అరెస్ట్ thives-arrested-by-banjarahills-police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6045615-744-6045615-1581499254131.jpg)
13:43 February 12
రూ.1.5 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు స్వాధీనం
పని వాళ్లుగా చేస్తామంటూ ఇంట్లో చేరి.. ఎవరూ లేని సమయంలో ఇళ్లంతా గుళ్ల చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారవుతారు. అటువంటి చర్యలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను బంజారాహిల్స్ పోలీసులు నేడు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.1.5 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు బిహార్ వాసులుగా గుర్తించినట్లు బంజారాహిల్స్ పోలీసుల వెల్లడించారు.
ఇవీ చూడండి:సైబర్ క్రైం పోలీసులకు అనసూయ ఫిర్యాదు