తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం: హరీశ్​రావు

రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ అవుతోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు తెలిపారు. ఇప్పటి వరకు 39 లక్షల మంది రైతులకు రూ. 2,736 కోట్లు చేరినట్లు వివరించారు. లాక్​డౌన్​ వల్ల ఆదాయం తగ్గిపోయినా.. రైతుబంధుకు నిధులు సమకూర్చడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.

This is the proof of government integrity: Harish Rao
ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం: హరీశ్​రావు

By

Published : Jun 23, 2020, 5:46 AM IST

రైతుబంధు పథకం నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు తెలిపారు. రిజర్వ్ బ్యాంకుకు చెందిన ఈ-కుబీర్ ప్లాట్​ఫాం ద్వారా నగదు బదిలీ జరుగుతోందన్నారు.

ఇప్పటి వరకు 39 లక్షల మంది రైతులకు రూ.2,736 కోట్లు చేరినట్లు వివరించారు. మంగళవారం కూడా నగదు బదిలీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న రైతులందరికీ సాయం అందుతుందని హారీశ్​రావు తెలిపారు.

50.84 లక్షల మంది రైతులకు సాయం అందించనున్నట్లు వివరించారు. జూన్ 16 వరకు పాస్ పుస్తకాలు వచ్చిన ప్రతిఒక్కరికీ సాయం అందుతుందన్నారు. రైతులకు లబ్ధిచేకూరేలా వ్యవసాయ, రెవెన్యూ, ఆర్థికశాఖ అధికారులు బాగా కష్టపడ్డారని ప్రశంసించారు.

కరోనా వల్ల ఆదాయం బాగా తగ్గిపోయినా.. రైతుబంధుకు ప్రభుత్వం నిధులు సమకూర్చిందన్నారు హరీశ్​ రావు. రైతుల సంక్షేమం విషయంలో సర్కారు చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని స్పష్టం చేశారు. వానాకాలంలో రైతుబంధు కోసం కేటాయించిన రూ.7 వేల కోట్లు పూర్తిగా రైతన్నలకు చేరేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు.

ఇదీ చూడండీ :హరితహారం లక్ష్యం సాధించాలి.. నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు

ABOUT THE AUTHOR

...view details