గణపతి నవరాత్రులు అనగానే అందరి మదిలో టక్కున మెదిలేది ఖైరతాబాద్ మహాగణేశుడే. వినాయకుని పండుగ దగ్గరపడిందంటే చాలు... ఖైరతాబాద్ గణేశుని ఎత్తు, రూపంపై జోరుగా చర్చ జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన రూపంలో ఇక్కడి వినాయకుడు దర్శనమిస్తుంటాడు. అలాగే ఈఏడాది సైతం శ్రీ ద్వాదశదిత్య ఆకృతిలో అందిరి ముందుకు రాబోతున్నాడు. 61 అడుగుల ఎత్తుతో నిర్మించే ఈ ఖైరతాబాద్ గణేశుడికి కుడివైపున విష్ణు, ఏకాదశి దేవి... అలాగే ఎడమ వైపు బ్రహ్మా, విష్ణు మహేశ్వరులు , దుర్గాదేవి కొలువుతీరనున్నారు.
ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి రూపం ఇదే - Khairathabad ganesh
గణపతి పండుగ వస్తుందంటే చాలు..అందరి చూపు ఖైరాతాబాద్ గణపతి వైపే. ప్రతి ఏడాది ఒక ప్రత్యేకమైన రూపంలో దర్శనమిస్తుంటాడు విఘ్నేశ్వరుడు. ఈసారి సైతం శ్రీ ద్వాదశదిత్య మహా గణపతి రూపంలో 61 అడుగుల ఎత్తుతో దర్శనమివ్వబోతున్నాడు.
ఖైరతాబాద్ గణపతి